సంక్షేమానికి పెద్దపీట

Advertiseme

– భారీ జనసందోహం మధ్య సాగిన నురుకుర్తి పాదయాత్ర
– అడుగడుగున మహిళల మంగళహారతి
– జై జగన్.. జై కన్నబాబు అంటూ కదం తొక్కిన వైకాపా యువత.

విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ రూరల్ :

రాష్ట్రంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు) తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో నాడు- ప్రజల కోసం కార్యక్రమం వాకలపూడి గ్రామంలో ఆ గ్రామ వైసిపి అధ్యక్షులు గొల్లపల్లి జగన్ ఆధ్వర్యంలో మంగళవారం సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా వైసీపీ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, రాష్ట్ర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి లయన్ జమ్మలమడక నాగమణి, రావూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వాకలపూడి రామకృష్ణ నగర్ నుండి మొదలై, మెయిన్ రోడ్ మీద గా వెళ్లి అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి, గంగా లమ్మ తల్లికి పూజలు చేసి,  అనంతరం వైస్సార్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కన్నబాబు అదేశాలతో ప్రతి గ్రామంలో యాత్ర చేపదుతున్నట్లు తెలిపారు. ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3648కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్రంలో 80 శాతం సీట్లు,51 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నారు. మొదటి ఏడాదిన్నర పాలనలో అమ్మఒడి, ఆసరా వరకు ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేశారన్నారు. కరోనా వల్ల ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న సంక్షేమ పథకాలు ఆగ లేదన్నారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ఆయన పలు సంక్షేమ పథకాల అమలుతో ప్రజల గుండెల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నారన్నారు. ఈ యాత్రలో వైసీపీ యువత పాల్గొని పెద్దఎత్తున జై జగన్, జై కన్నబాబు అంటూ కదం తొక్కారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గ్రామకమిటీ సభ్యులు నల్ల శ్రీను, మైనారిటీ సెల్ కరీం భాష, రాణి, వీధి విజయ సారధి, నున్న వేంకటేశ్వర రావు, విత్తనాల రమణ, కొల్ల బోయేన భవాని, గంపల సత్యాన్నరాయన, వీసరపు అప్పారావు, కడియాల రాజు, వైఎస్సార్ రాజు, చేల్లి దేవరాజు, మల్లీశ్వరి, ప్రసన్న, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme