డా.జి.వెంకట్రావు కు అరుదైన అవకాశం…

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, రాజానగరం :

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మేథమెటిక్స్ అధ్యాపకులుగా పని చేస్తున్న డా.జి.వెంకట్రావు జెఈఈ మెయిన్స్ పెపర్ సెటింగ్ 2021 కొరకు ఎంపికైయ్యారు. దక్షణ భారతదేశం నుండి తొలిసారిగా జెఈఈ(జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) ఐటమ్ రైటింగ్ వర్క్ షాప్ కు నన్నయ అధ్యాపకుడు ఎంపిక కావడం హర్షనీయమని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అభినందనలు తెలియజేసారు. విశ్వవిద్యాలయంలో శుక్రవారం డా.జి.వెంకట్రావుకు వీసీ పుష్పగుచ్చాన్ని అందించి అభినందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా.జి.వెంకట్రావుకు అరుదైన అవకాశం దక్కిందని అన్నారు. తొలిసారిగా దక్షణ భారతదేశం నుండి జెఈఈ పెపర్ సెటింగ్ కొరకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. డా.జి.వెంకట్రావు అంతర్జాతీయంగా 20 పరిశోధన పత్రాలను ప్రచురించారని, ఇంజనీరింగ్ లోని మేథమెటిక్స్ కు సంబంధించిన రెండు పాఠ్య పుస్తకాలను వ్రాసారని అన్నారు. డా.జి.వెంకట్రావుకు విద్యాపరంగా ఉన్న ప్రాధన్యతను బట్టి జెఈఈ మెయిన్స్ పెపర్ సెటింగ్ కు ఎంపికయ్యారని తెలిపారు. నవంబర్ 08 నుండి 11వ తేది వరకూ డిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ పేపర్ సెటింగ్ కు వెళ్ళివచ్చారని చెప్పారు. నన్నయ విశ్వవిద్యాలయంలో అనువజ్ఞులైన అధ్యాపకులు ఎందరో ఉన్నారని వారంతా తమతమ విభాగాలలో ప్రతిభను కనపరచాలని తెలిపారు. డా.జి.వెంకట్రావుకు రిజిష్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు, ప్రిన్సిపాల్ డా.వి.పెర్సిస్, విభాగాధిపతి డా.పి.వెంకటేశ్వరావు, లీగల్ ఆఫిసర్ నందెపు నాగేంద్రరావు, బాలకృష్ణ తదితరులు అభినందనలు తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme