ఫ్రీ ప్రైమరీ పాఠశాలలు గా అంగన్ వాడి సెంటర్లు

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ సిటీ :

అంగన్వాడి సెంటర్ల కు వచ్చే చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు నూతనంగా ప్రీ ప్రైమరీ పాఠశాలలు గా అంగన్వాడి సెంటర్లను మార్చడం జరుగుతుందని జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారి డి.పుష్పమణి తెలిపారు. సోమవారం కాకినాడ కల్పనా సెంటర్ వద్ద గాంధీ భవన్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, ఓల్డ్ విజ‌న్ స్వ‌చ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించిన బాలల దినోత్సవం, బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమానికి ఐసీడీఎస్ పీడీ డి.పుష్ప‌మ‌ణి, అడిషనల్ ఎస్పీ క‌ర‌ణం కుమార్, డిఈఓ ఎస్ అబ్రహం, దిశ డిఎస్పి మురళీమోహన్, సిడబ్ల్యుసి చైర్పర్సన్ టి.పద్మ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి.పుష్ప‌మ‌ణి మాట్లాడుతూ.. తూర్పుగోదావ‌రి జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా గుర్తింపు తెచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో బాలలు ఎదిగేందుకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని, బాల్యం ప్రతి మనిషికి ఒక తీపి జ్ఞాపకం లాంటిదని ఆమె తెలిపారు.  సమాజంలో విద్య ద్వారానే గుర్తింపు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బాలల విద్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంద‌న్నారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14 నుంచి 20వరకు బాలల హక్కుల వారోత్సవాలు జిల్లా అంతటా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వారం రోజులు వివిధ అంశాలపై అంగన్వాడి, ఆశావర్కర్లు, డ్వాక్రా సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. అదేవిధంగా నవంబరు నెల ను అంతర్జాతీయ దత్తత మాసంగా ప్రకటించడం  జరిగిందన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్నా ఇంకా మన ప్రాంతాల్లో అక్కడక్కడ బాల్యవివాహాలు జరుగుతున్నాయని, జిల్లాలో బాల్యవివాహాల నివారణకు గ్రామస్థాయిలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కృషి చేయాలని ఆమె సూచించారు. అదనపు ఎస్పీ కరణం కుమార్ మాట్లాడుతూ బాలలు సక్రమ మైన మార్గంలో పయనించేందుకు చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబసభ్యులు చక్కటి దిశానిర్దేశం చేయాలన్నారు. బాలల చదువు, భద్రత, సంరక్షణ కోసం ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడం జరిగిందని ప్రభుత్వం అందిస్తున్న భద్రతా చర్యలను బాలలు, ముఖ్యంగా ఆడపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం మాట్లాడుతూ విద్యాశాఖ నుంచి కూడా బాల‌ల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం చాలామంది పిల్లలు మధ్యలోనే పాఠశాలలు మానేస్తారని రాష్ట్ర ప్రభుత్వం బాలల విద్య అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న‌ట్లు తెలిపారు. పాఠశాలలకు వెళ్లి చ‌దువుకోలేని వారికి ప్రత్యేకంగా ఓపెన్ స్కూలు కూడా అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. దిశ డీఎస్‌పీ ఎస్.మురళీమోహన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భారతదేశ భవిష్యత్తు అని అన్నారు. బాలలు శారీర‌కంగా,  మానసికంగా అన్ని రంగాల్లో బలంగా ఉంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. బాల బాలికలపై ప్రస్తుత సమాజంలో జరుగుతున్న హింస‌ల‌ను నివారించేందుకు మన రాష్ట్రప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా దిశ చట్టాన్ని రూపొందించి అమలు చేస్తోందన్నారు. బాలల సంరక్షణ కోసం క్షేత్రస్థాయిలో అంగన్వాడి, ఏఎన్ఎంలు షీ టీమ్‌లు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని ఆయన సూచించారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ టీ.పద్మ మాట్లాడుతూ బాలలందరూ దేశం కోసం సేవలు అందించే విధంగా ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. చిన్ననాటి నుంచి సమాజం పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలని ఆమె తెలిపారు. బాలలు వారి హక్కులతో పాటు బాధ్యతలు పై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. తప్పిపోయిన, అనాధ బాలల పట్ల గ్రామ, వార్డు స్థాయిలో వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. బాలలందరూ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై అవగాహన పెంపొందించుకోవాలని ఆమె తెలిపారు. అనంతరం అంతర్జాతీయ దత్తత మాసం సందర్భంగా జిల్లా శిశు గృహం లో ఆశ్రయం పొందుతున్న నాలుగు నెలల అనాధ పాపను బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్త దంపతులు తోమసయ్య, బాలతెరిసాలు ఐసీడీఎస్ పీడీ డి.పుష్ప మణి చేతుల మీదుగా దత్తత స్వీకరించారు. అనంతరం అంతర్జాతీయ దత్తత మాసం పోస్టర్‌ను విడుదల చేశారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ వెంకట్రావు, ఏపీడీ టి.పద్మజ, ఓల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బ్రహ్మన్న, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


ఈ న్యూస్ పోస్ట్ చేసిన వారు : PSVPrasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme