బాబుగారూ కాస్తా కనికరం చూపించరూ……

Advertiseme

– పేరు గొప్ప ఊరు దిబ్బగా రాయనపేట గ్రామం
– గ్రామంలో అద్వాన్నంగా మారిన అంతర్గత రోడ్లు
– ఏళ్ళు గడిచినా పట్టించుకునే నాథుడే కరువు
– ఇకనైనా పట్టించుకోవాలని గ్రామస్తుల వేడుకోలు

విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక :

మండలంలోనే పెద్ద గ్రామపంచాయతీగా పేరు గాంచిన రాయనపేటలో పరిస్థితి మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. రాయనపేట గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు , మంచినీరు ఏర్పాట్లు ఉన్నప్పటికీ గ్రామపంచాయతీ పేరుతో ఉన్న రాయనపేట గ్రామంలో మాత్రం సమస్యలు తాండవిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ గ్రామాన్ని ఎన్నో ఏళ్ళుగా పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య అంతర్గతంగా ఉన్న రోడ్లు పాడైపోయాయి. గత ప్రభుత్వాలు ఈ అంతర్గత రోడ్ల సమస్యపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో వైకాపా అధినేత , నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గతంలో చేసిన ప్రజా సంకల్పయాత్ర పూర్తయి మూడు సంవత్సరాలవుతున్న సందర్భంగా సంఘీభావం తెలుపుతూ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని గిరిజన , బడుగు , బలహీన వర్గాల వారి సమస్యలు తెలుసుకోవడమే ప్రధాన ఎజెండాగా చేస్తున్న సంఘీభావ పాదయాత్ర శనివారం రాయనపేట గ్రామానికి వస్తున్న క్రమంలో తమ గ్రామంలోని సమస్యలపై కాస్తా కనికరం చూపి సిసి రోడ్లు వేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత (బాబు) ఉదయ్ భాస్కర్ మరియు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి.ధనలక్ష్మిలను రాయనపేట గ్రామస్తులు పత్రికాముఖంగా వేడుకుంటున్నారు. ఎటపాక మండల పరిధిలోని రాయనపేట గ్రామంలో ప్రజలకు ఏళ్ళు గడుస్తున్నా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి గానీ పేరుకే పెద్ద పంచాయతీగా ఉన్న తమ గ్రామ తలరాత మాత్రం నేటికి మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు వారికి ఇబ్బందులు మొదలైనట్టే. కనీసం నడవడానికి కూడా వీలులేకుండా రోడ్లపై బురద పేరుకు పోతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మీకు అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు గుప్పించిన పలు పార్టీల నాయకులు ఇప్పుడు ఏ కోశానా గ్రామంలో కనబడటం లేదని వారు వాపోతున్నారు. ఎటపాక మండలంలోనే పెద్ద పంచాయతీగా పేరొందిన రాయనపేటలో మాత్రం మౌలిక సదూపాయాలు , కనీస సౌకర్యాలు కరువు. అయితే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో వైకాపా ప్రభుత్వం గ్రామాల్లో పెద్ద ఎత్తున సిసి రోడ్లను మంజూరు చేస్తున్న నేపథ్యంలో తమ గ్రామంలో సైతం అంతర్గత సిసి రోడ్లు వేయాలని గ్రామస్తులు గ్రామస్థాయి అధికారులను కోరగా తమ చేతుల్లో ఏమి లేదని గ్రామసమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం గమనార్హం. ఈ విధంగా ఎన్నో ఏళ్ళుగా జరుగుతుందని , గ్రామాన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత (బాబు) ఉదయ్ భాస్కర్ మరియు రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme