ఏడిదలో ఘర్షణ..

Advertiseme

– ఇరువర్గాల తగాదా…
– నలుగురికి గాయాలు..
– కాకినాడ తరలింపు…

విశ్వంవాయిస్ న్యూస్, మండపేట :

పాత గొడవలు నేపథ్యంలో ఏడిదలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ వర్గం యువకులు మరో వర్గం వారిపై దాడి చేశారు. ఈ ఘటన లో నలుగురు గాయపడ్డారు. వీరిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. రూరల్ సి ఐ కె మంగదేవి కధనం మేరకు మండపేట మండలం ఏడిదలో ఇటీవల మండపేట నియోజకవర్గ వైకాపా ఇన్ చార్జ్ తోట త్రిమూర్తులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిద అంబేద్కర్ నగర్ కు చెందిన గెడ్డం రాజ్ కుమార్,దుళ్ళ శమ్యూల్ రాజ్,గుర్రం అజయ్,బురిగ రాకేష్ లు తీన్మార్ డప్పులు మోగించారు.అనంతరం కిళ్ళీ షాప్ వద్ద డ్రీంకు లు సేవిస్తుండగా గతంలో తీన్మార్ లో ఉన్న అదే గ్రామానికి చెందిన పెనుమళ్ల ప్రకాష్,బొచ్చా తరుణ్,చేబ్రోలు నరసింహ రాజు,ధవళేశ్వరం కు చెందిన అఖిల్ తో బాటు మరో నలుగురు వీరితో వాగ్వివాదం కు దిగారు. ప్రకాష్ ను నిక్ నేమ్ తో పిలవడం తోనే గొడవ పెద్దది ఐయింది. ఈ నేపథ్యంలో అఖిల్ వద్ద ఉన్న చిన్న చాకు తో నలుగురి ని పొడిచాడు.దీంతో వారికి గాయాలు కాగా తొలుత మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం కాకినాడ తరలించారు. ఈ మేరకు ఆలమురు ఎస్ ఐ సోమన శివ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme