జిల్లా లో సర్వే నెంబర్ల ప్రకారం సాగవుతున్న పంట విస్తీర్ణ వివరాలు అందుబాటులో వుండాలి.

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ సిటీ :

జిల్లాలో సర్వే నెంబర్లు ప్రకారం సాగు అవుతున్న పంట విస్తీర్ణ వివరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో వుండాలనీ కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ తన కార్యాలయపు సమావేశపు మందిరంలో జేసి (ఆర్)జి.లక్ష్మీశతో కలిసి ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యానవన, ఫిషరీస్ శాఖ అధికారులతో ఆయు కట్టు విస్తీర్ణలో సాగు అవుతున్న భూములపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే నంబర్లు ప్రకారం వ్యవసాయంలో ఎంత భూమి సాగు అవుతుంది, ఉద్యానవన, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎంత భూమి సాగు అవుతుందనే వివరాలు అందుబాటులో వుండాలన్నారు. ఈ నెల 24 వ తేదీన ఇరిగేషన్ అడ్వజరీ బోర్డు జిల్లా స్థాయి సమావేశానికి పూర్తి సమాచారంతో ఆయా శాఖల అధికారులు సన్నద్ధంగా వుండాలన్నారు. 2021 ఏప్రియల్ ఒకటవ తేదీ నుండి జూన్ పదవ తేదీ వరకు వందరోజుల పాటు పోలవరం కాపర్ డ్యాం పనులు జరిగే నేపద్యంలో జిల్లాలో ఎక్కడ తాగు, సాగు నీరు ఇబ్బందులు తలత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేర తదనుగుణంగా సంబంధిత శాఖలు అన్ని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మార్చి 31, 2021 నాటికి పోలవరం నుండి నీటి విడుదల పూర్తి స్థాయిలో నిలుపుదల చేస్తారన్నారు. ఏప్రిల్ 2021 నుండి జూన్ 2021 వరకు మూడు నెలల పాటు తాగు, సాగు నీరు అవసరాలకు కావలసిన నీటి సామర్థ్యం పై ఇరిగేషన్, గ్రామీణరక్షిత నీటి సరఫరా విభాగాల ఇంజనీర్లు పూర్తి స్థాయిలో ముందస్తు ప్రణాళికలో వుండాలన్నారు. గత సంవత్సరం వరదలు, వర్షాల సమయంలో పోలవరం నుండి కాలువలకు నీటి విడుదల విషయం కొన్ని సమస్యలు ఎదుర్కొడం జరిగిందనీ అలాంటి అంశాలకు అవకాశం లేకుండా పక్కా ప్రణాళిక ప్రకారం నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఇరిగేషన్, డ్రైనేజీ, కెనాల్ జనీరింగ్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏయే ప్రాంతాల్లో ఏ విధంగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలో ఇప్పటి నుండి పర్యవేక్షించాలన్నారు. సాగు భూములకు సంబందించి పూర్తి సమాచారం పై స్థాయి అధికారులతో పాటు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద వుండే విధంగా కార్యచరణ వుండాలనీ కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, ఇరిగేషన్, కెనాల్, డ్రైనేజీ శాఖల అధికారులకు దిశ నిర్దేశించారు. స్థానిక ఆదర్శ రైతులు, వ్యవసాయ అధికారులు కారుల, గ్రామ వ్యవసాయ సహాయకులు సమన్వయంతో పనిచేసి గోదావరి బ్యారేజ్ లో నిల్వవున్న నీటిని సద్వినియోగం చేసుకోనే విధంగా పనిచేసి మూడు నెలల పాటు సాగు , తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా పర్యవేక్షించాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు…… డ్రైనేజీలు, పంట కాలువలపై వున్న ఆక్రమణలు తొలగింపు కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా 4100 చోట్ల డ్రైనేజీలు, పంటకాలువలపై ఆక్రమణలకు గురయ్యాయని కలెక్టర్ తెలిపారు. వీటిని సత్వరమే తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పూర్తి స్థాయిలో ఆక్రమణ తొలగించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. కాలువల్లో తూటుకాడ వలన చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదనే సమస్య పై సంబంధిత ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షింస్తువుండాలన్నారు. పోలవరం కాపర్ డ్యాం పనుల నేపధ్యంలో జిల్లా ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో రబీ సాగుకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధుల సహాకారంతో రైతులకు అవగాహన కల్పించి పంట సాగు చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ ఓ సిహెచ్.సత్తిబాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఇరిగేషన్, పోలవరం లెఫ్ట్ మొయిన్ కెనాల్ (తుని), హెడ్ వర్క్ సర్కిల్ పోలవరం పశ్చిమగోదావరి జిల్లా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏలేరు రిజర్వాయల్, సెంట్రల్, వెస్ట్రన్, ఇన్స్టన్, డెల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme