అది సంక్షేమ యాత్ర

Advertiseme

– పాదయాత్ర ముగింపు సభలో మంత్రి చెల్లుబోయిన
– సంఘీభావ యాత్ర లో బ్రహ్మరథం పట్టిన మహిళలు

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం :

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజాసంకల్పయాత్ర నాంది పలికిందని, అది సంక్షేమ యాత్రని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అన్నారు. ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు ఈ కార్యక్రమంలో పదో రోజు మంత్రి నిర్వహించిన పాదయాత్ర రామచంద్రపురం లో సోమవారం జరిగిన బహిరంగ సభ తో ముగిసింది.స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు వేలాది మంది మహిళలతో పాదయాత్ర చేపట్టారు. అనంతరం మంత్రి వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఆర్దికంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన,  గోరుముద్ద, చేయూత,కాపు నేస్తం, పేదవారికి  ఇళ్ల పట్టాలు మొదలైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటివంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.మహిళల పరపతిని పాడుచేసినటువంటి వ్యక్తి  చంద్రబాబు అని, మహిళకు ఉన్నత పరపతి కల్పించిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో  ఏ మహిళ కలలో కూడా ఊహించని విధంగా నేడు చేయూత పథకం ద్వారా  45 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ ఖాతాలో 18 వేల 750 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాలకు రూ. 75 వేల  ప్రతి మహిళా ఖాతాలో జమ అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి వేణు తనయులు చెళ్లుబోయిన నరేన్, వైఎస్ఆర్సిపి నాయకులు గాధంశెట్టి శ్రీధర్, బుద్దవరపు రామరాజు, మాదిగ ఐక్యవేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు, ఉప్పలగుప్తం దేవానందం, చుక్కా శేషు, కొప్పిశెట్టి లక్ష్మణ్, దొమ్మలపాటి సత్యనారాయణ, ప్రశాంత్ బాబు, సాయి కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఈ న్యూస్ పోస్ట్ చేసిన వారు : PSVPrasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme