సంఘీభావ పాదయాత్రను జయప్రదం చేయండి.

Advertiseme

సంఘీభావ పాదయాత్రను జయప్రదం చేయండి.
– వైకాపా ఎటపాక మండల సమన్వయ కమిటీ పిలుపు

విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక :

వైకాపా అధినేత , రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో సంఘీభావం తెలుపుతూ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ మరియు ఎమ్మెల్యే నాగులాపల్లి.ధనలక్ష్మి పలుచోట్ల చేపట్టిన పాదయాత్రను జయప్రదం చేయాలని వైకాపా ఎటపాక మండల సమన్వయ కమిటీ సభ్యులు , జిల్లా నాయకులు కురినాల.వెంకట్ (బుజ్జి) మరియు మండల సొసైటీ అధ్యక్షులు ఆకుల.వెంకటరామారావు పార్టీ శ్రేణులకు , మండల ప్రజానీకానికి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చోడవరం గ్రామంలో స్థానిక ఎంపిటిసి యాలమోల.రమేష్ గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 21వ తేది శనివారం ఉదయం 10.30 గంటలకు మండలంలోని చోడవరం గ్రామపంచాయతీ పాండురంగాపురం నుండి పాదయాత్ర మొదలై రాయనపేట గ్రామపంచాయతీలోని కొండిపల్లి , మంగువాయి , తాటాకులగూడెం మీదుగా రాయనపేటకు చేరుకుంటుందని వారు పేర్కొన్నారు. గిరిజన , బడుగు , బలహీన వర్గాల వారి సమస్యలు తెలుసుకోవడం కోసమే ప్రధాన ఎజెండాగా సంఘీభావ పాదయాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు. కావున వైకాపా అభిమానులు , కార్యకర్తలు , మండల ప్రజలు పెద్దఎత్తున పాల్గోని సంఘీభావ పాదయాత్రను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో వైకాపా సమన్వయ కమిటీ సభ్యులు , వైకాపా నాయకులు డేగల.రామకృష్ణ , రంభాల.నాగేశ్వరరావు , బాచినేని.రామకృష్ణ , మహిళా నాయకురాలు ఉబ్బా.సుస్మిత , దొంతు.నాగేశ్వరరావు , మేడిపల్లి.కృష్ణ , ఏసుపాక.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme