సంఘీభావ పాదయాత్ర ముగింపు సభా స్థలం పరిశీలన

Advertiseme

సంఘీభావ పాదయాత్ర ముగింపు సభా స్థలం పరిశీలన
– వైకాపా మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక :

వైకాపా అధినేత , నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గతంలో చేసిన ప్రజా సంకల్పయాత్ర పూర్తయి మూడు సంవత్సరాలవుతున్న సందర్భంగా సంఘీభావం తెలుపుతూ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత (బాబు) ఉదయ భాస్కర్ మరియు ఎమ్మెల్యే నాగులపల్లి.ధనలక్ష్మి ఎటపాక మండలంలో శనివారం చేపట్టనున్న పాదయాత్ర ముగింపులో జరిగే సభ ఏర్పాటు కోసం రాయనపేట గ్రామంలో స్థలాన్ని వైకాపా మండల నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాదయాత్రను జయప్రదం చేయాలని వైకాపా ఎటపాక మండల సమన్వయ కమిటీ సభ్యులు , మండల సొసైటీ అధ్యక్షులు ఆకుల.వెంకటరామారావు , జిల్లా నాయకులు కురినాల.వెంకట్ (బుజ్జి) పార్టీ శ్రేణులకు , మండల ప్రజానీకానికి పిలుపునిచ్చారు. 21వ తేది శనివారం ఉదయం 10.30 గంటలకు మండలంలోని చోడవరం గ్రామపంచాయతీ పాండురంగాపురం నుండి పాదయాత్ర మొదలై రాయనపేట గ్రామపంచాయతీలోని కొండిపల్లి , మంగువాయి , తాటాకులగూడెం మీదుగా రాయనపేటకు చేరుకుంటుందని , అనంతరం సభ నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. గిరిజన , బడుగు , బలహీన వర్గాల వారి సమస్యలు తెలుసుకోవడం కోసమే ప్రధాన ఎజెండాగా సంఘీభావ పాదయాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైకాపా అభిమానులు , కార్యకర్తలు , మండల ప్రజలు పెద్దఎత్తున పాల్గోని సంఘీభావ పాదయాత్రను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో వైకాపా సమన్వయ కమిటీ సభ్యులు , వైకాపా నాయకులు డేగల.రామకృష్ణ , రంభాల.నాగేశ్వరరావు , బాచినేని.రామకృష్ణ , ఎలమోలు.రమేష్ , గ్రంధి.మల్లిఖార్జున్ , బచ్చలకూరి.హరినాధ్ , మర్రి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme