రాష్ట్రంలో 4 కోట్లు దాటిన ఓటర్లు

Advertiseme

– 4,01,45,674 రాష్ట్ర ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
– పురుషుల కంటే మహిళలే ఎక్కువ
– 2,02,83,145కి చేరిన మహిళా ఓటర్లు
– పురుషుల సంఖ్య 1,97,91,597
– జనవరి 15న తుది లిస్టు ప్రకటన: సీఈవో

విశ్వంవాయిస్ న్యూస్, అమరావతి :

ఎన్నారైలు, సర్వీసు ఓటర్లను కలుపుకొని రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,01,45,674కి చేరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముసాయిదా ఓటర్ల జాబితా(ఎ్‌సఎ్‌సఆర్‌2021)ను విడుదల చేశారు. ఇందులో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పురుష ఓటర్లు 1,97,91,597 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 2,02,83,145. థర్డ్‌జెండర్‌ ఓటర్ల సంఖ్య 4,083కి చేరింది. సర్వీస్‌ ఓటర్లు 66,649, ఎన్నారై ఓటర్ల సంఖ్య 7,126గా నమోదైంది. 18-19 ఏళ్ల వయస్కులు 1,03,336 మంది. 2020లో తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత ముసాయిదా జాబితాలో 3,26,824 మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. ఇంకోవైపు.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని విజయానంద్‌ పిలుపిచ్చారు.
వచ్చే జనవరి నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా తమ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి డిసెంబరు 15 తేదీ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని.. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో తమ ఓటును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆ తర్వాత ఓటర్ల నమోదులో తప్పొపులను పరిశీలించడం, అభ్యంతరాలు స్వీకరించడం, పరిష్కరించడం జరుగుతుందన్నారు. జనవరి 15 తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme