అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి

Advertiseme

– రాష్ట్ర బీజేవైఎం పిలుపుమేరకు అమలాపురంలో నిరసన దీక్ష
– సంఘీభావం తెలిపిన అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు మానేపల్లి అయ్యాజీ వేమ

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం :

రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలకు వృత్తి, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని బిజెపి అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మానేపల్లి అయ్యాజి వేమ డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేవైఎం పిలుపులో భాగంగా మంగళవారం అమలాపురం స్థానిక గడియార స్తంభం వద్ద భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు అయ్యాజీ వేమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వృత్తి, ఉద్యోగాల్లో తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన జెఈఈ మైన్స్, పిజి మెడికల్, ఎంసెట్ తరహా విద్యా ప్రవేశాల లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వక పోవడం వలన విద్యార్థులు, సచివాలయ ఉద్యోగ భర్తీ లో అభ్యర్థులు రిజర్వేషన్లు కోల్పోయారనీ వివరించారు. రానున్న జనవరి లో ఉద్యోగ భర్తీ లు జరగనున్న నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లు 10 శాతం తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజేవైఎం నాయకులు మంతెన సతీష్ రాజు, సరిది దుర్గా ప్రసాద్, ఈశ్వర్ గౌడ్, కటికిరెడ్డి గంగాధర్, పాలూరి  జయప్రకాష్, గణిశెట్టి అరవింద్, దేశీనేడి కిరణ్, కాసిన ఫణి, అరిగెల తేజ వెంకటేష్, రాజు  తదితర బీజేపీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీక్షకు సంఘీభావం తెలిపిన వారిలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూరి రాజేష్, నల్ల పవన్, యళ్ల అప్పలరాజు, ఆకుల వీరబాబు, అయ్యల భాష, దేవాదుల సూర్య నారాయణ మూర్తి, జనసేన పితాని బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme