షెడ్యూల్ కులాలు,తెగలు,వెనకబడిన తరగతుల మేలు మర్చిపోలేము.యంపి పిల్లి బోస్

Advertiseme

– పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు
– ప్రజల అభిమానాన్ని మర్చిపోలేను

విశ్వంవాయిస్ న్యూస్, పెనుమంట్ర :

వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో షెడ్యూల్ కులాలు, తెగలు,వెనకబడిన తరగతుల మేలు మర్చిపోలేమని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.ప్రజలలో నాడు –  ప్రజల కోసం నేడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో భాగంగా సోమవారం పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామం నుండి మార్టేరు సెంటర్ వరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేపట్టిన పాదయాత్ర ప్రారంభించి  దివంగత ముఖ్యమంత్రి  వైఎస్  రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అంజలి ఘటించిన  అనంతరం మార్టేరు సెంటర్ లో జరిగిన  బహిరంగసభకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా యంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల,వెనకబడిన తరగతులకు ప్రభుత్వం అందించిన నలభైఐదు వేల కోట్ల మంజూరులో ఇరవైఐదు శాతం అభివృద్ధికి అందించిన ఘనత సీయం జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు.మన ప్రాంతంలో నూటికి ఎనబై శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం.ఇందుకు ఇరవైరెండు పధకాల ద్వారా రైతులకు లబ్ది చేకూరుస్తున్నామని అన్నారు.కౌలు రైతుకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అయినప్పటికీ నేడు నేరచరిత్ర, వ్యాపారాల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి, ఈ పరీక్షలలో మీరే న్యాయ నిర్ణేతలను నిర్ణయించాలని అన్నారు.వాలంటీర్ లు కుల,మత,పార్టీలకు అతీతంగా పేదరికాన్ని పరిగణనలోకి తీసుకొని లబ్దిదారులకు పధకాలు అందించాలని సూచించారు.అనంతరం ప్రజల ఆదరాభిమానాలుతో ఆచంట నియోజకవర్గ శాసనసభ్యునిగా గెలిచాను.ప్రజల అభిమానం ఎప్పటికి మర్చిపోలేను.పోననీ గృహ నిర్మాణ శాఖమంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు.కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఎదురుకొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందించడం శుభపరిణామం.నవరత్నాలలో భాగంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి అందేలా కృషి చేస్తున్నారు.సీయం జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయనీ,ఆచంట నియోజకవర్గంలో నూటముపై కోట్ల ఎనభై లక్షలు రూపాయలు పలు అభివృద్ధి పనులకు వెచ్చించాము.ఇచ్చిన ప్రతి హామీలును నెలబెట్టుకొంటా.ప్రజలు కోసం నిరంతరం శ్రమిస్తాను.పదమూడు వేల మందికి నియోజకవర్గంలో ఇంటి స్థలాలు అందే విధంగా కృషి చేసున్నామనీ మంత్రి రంగనాథరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బలిజ కార్పోరేషన్ ఛైర్మన్ గుబ్బల తమ్మయ్య ,రాష్ట్ర శెట్టిబలిజ కార్పోరేషన్ డైరెక్టర్ మామిడిశెట్టి కృష్ణవేణి,డిసిసిబి డైరెక్టర్ కూనపురెడ్డి నానాజీ, ఆచంట ఏయంసీ ఛైర్మన్ సుంకర ఇందిరా సీతారాం,పెనుగొండ ఏయంసీ ఛైర్మన్ దంపనబోయిన చిట్టి బాబూరావు, నియోజకవర్గం బూత్ కమిటీ కన్వీనర్ కర్రీ వెంకట నారాయణరెడ్డి (వాసురెడ్డి) మండల కన్వీనర్ సత్తి విష్ణు కుమార్ రెడ్డి, శివాజీరాజు,వైయస్ఆర్ సీపి నాయకులు బొక్కా అరుణ,సుంకర సీతారాం, కర్రీ గౌరీ సుభాషిని వేణుబాబు, వైట్ల కిషోర్, వేదాల నాగరాజు, చింతపల్లి గురుప్రసాద్,దిద్దె శ్రీనివాస్,పోతుమూడి రామచంద్రరావు,కర్రి రామలింగేశ్వర రెడ్డి,కొవ్వూరి సీత,గెద్దాడ ఏకలవ్య,గుత్తుల బోస్,మనూరి సాయశ్రీనివాస్,పెద్ద ఎత్తున మహిళలు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme