ఫోన్‌ వస్తే అంతే.. లిఫ్ట్‌ చేశారో సమస్తం గల్లంతు

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, :

స్నేహితుడో, స్నేహితురాలి ఫొటోతోనో ఫోన్‌ వచ్చిందని, నంబర్‌ చూడకుండా ఫోన్‌ ఎత్తారో మీ సమస్త సమాచారం గల్లంతవుతుందని హెచ్చరిస్తున్నారు టెలీకాం ప్రతినిధులు, సైబరాబాద్‌ పోలీసులు. ఈ మేరకు ఓ వీడియోను రూపొందించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. రోజు రోజుకూ సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త ఎత్తుగడలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు టెలీకాం, సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. కొన్ని సిరీ్‌సలతో కూడిన నంబర్‌లతో ఫోన్లు చేసి ప్రజలను బురిడీకొట్టిస్తున్నారు. ప్రజలు నంబర్‌లు గుర్తించకుండా వారి స్నేహితుల ఫొటోలతో ఆ నంబర్‌లు సేవ్‌ చేస్తున్నారు.

సమాచారం గల్లంతు..

+92, +1, +968, +44 నంబర్‌ సిరీ్‌సలతో ఎక్కువగా నేరగాళ్లు సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్‌ మీడియాలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి ఖాతాలపై కన్నేసిన నేరగాళ్లు కొంతమందిని లక్ష్యం గా చేసుకుంటున్నారు. వారి ఫ్రెండ్స్‌ లిస్టులోంచి కొన్ని ఫొటోలను సేకరిస్తారు. ఆ తర్వా త మోసపూరిత నంబర్‌లను ఆయా వ్యక్తుల ఫొటోలతో సేవ్‌ చేస్తారు. ఆ ఫేస్‌బుక్‌ ఖాతా ఉన్న వ్యక్తికి ఫోన్‌ చేస్తారు. స్నేహితుడు, స్నేహితురాలి ఫొటోతో ఫోన్‌ రావడంతో సదరు వ్యక్తి నంబర్‌ చూడకుండానే ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తారు. అలా చేయగానే అతని ఫోన్‌లోని సమస్త సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతుంది. అలా అత్యాధునిక టెక్నాలజీతో మోసపూరిత ఫోన్‌లు, వాట్సాప్‌ ఫోన్‌లు చేస్తున్నారని సైబర్‌ క్రైం పోలీసులు, టెలీకాం సంస్థల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌, వాట్సాప్‌ కాల్‌ లిఫ్ట్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండి, ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme