గిరిజనుల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి.

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, రంపచోడవరం :

గిరిజనాభివృద్ధికై సెక్టోరియల్ అధికారులు పరస్పర అవగాహన పూర్తి సమస్వయం వహించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి వి.కె శీనా నాయక్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక ఐటిడిఎ సమావేశపు హాలులో నిర్వహించిన సెక్టోరియల్ అధికారులు సమస్వయం నిర్వహించి మాట్లాడుతూ గిరిజనుల సర్వతో ముఖాభివృద్ధికి అధికారులు పరస్పర సహకారం ఎంతైనా అవసరమని అపుడే ఆశించిన రీతిలో సత్ఫలితాలు వస్తాయన్నారు. ఐటిడిఎ క్వార్టరుకు సంబందించిన అద్దెలు సకాలములో ఉద్యోగులు చెల్లించాలని, బయోమెట్రిక్ హాజరు అందరూ తప్పనిసరిగా వేయాలని ఆయొక్క హాజరును ప్రతిరోజు డివిజనల్‌ స్థాయి అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్రసాయిలో ప్రభుత్వపరంగా వున్న కార్యాలయాల మార్కింగ్ వాటికి చేరేందుకు అవసరమైనరూట్లతోసహ మ్యాపులు రూపకల్పన చేసినపుడే వాటి నిర్వహణ తీరును పరిశీలించేందుకు అవకాశాలు మెరుగుపడతాయన్నారు. చెత్తను ఎక్కడి పడితే అక్కడ వేయకుండా పంచాయితీ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే కఠిన చర్యలు వివిధ సెక్షన్ల ప్రకారం విధించి చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటక ప్రాంతాలలో పారిశుద్ధ్యవ్యవస్థలను మెరుగుపర్చాలన్నారు. స్థానికంగా వున్న జిమ్ సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఇఇను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ వెల్‌నెస్ కేంద్ర భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాలు కేటాయింపుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నిర్దేశిత కాలవ్యవధులలో వాటి నిర్మాణాలు పూర్తి చేసి ఆయా సేవలను అందుబాటులోనికి తీసుకొని రావడంలో ప్రత్యేక చొరవ చూపాలని ఆయన అన్నారు. జిల్లాస్థాయి అధికారులు సూచనలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి ప్రభుత్వ ఆశించిన రీతిలో వాటి అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలలో ఆయా కేంద్రాల ద్వారా లభించు సేవలు, లబ్దిని పొందిన లబ్దిదారులు జాబితాలు ప్రదర్శించాలన్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలుకు సంబందించిన విదివిదానాలు విధిగా ప్రదర్శించాలన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా రైతాంగానికి కనీస మద్దతు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. ప్రభుత్వాల ఆశయాలు ప్రతిబింబించే రీతిలో కార్యాలయాల నిర్వహణ తీరు ఉండాలన్నారు. సిబ్బంది ఎవరిస్థాయిలో వారు నిబద్ధత, అంకితభావంతో సేవలందించాలని సూచించారు. మంగంపాడు, దామణపల్లి గ్రామాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు అనువైన స్థలాలను త్వరలో కేటాయించి అప్పగిస్తామన్నారు. అనంతరం నిర్వహించిన స్పందన ప్రజా సమస్యల సరిష్కార వేదిక కార్యక్రమంలో సుమారు 40 మంది అర్జీదారులు తమ తమ సమస్యలను వ్రాత పూర్వకంగా ఆర్డీవో మరియు ఐటిడిఎ పరిపాలనాధికారి డిఎన్ వి రమణలకు అందజేసారు. విన్నపాలపై ఆయా శాఖల అధికారులతో పూర్తిగా విచారించిన పిమ్మట నిబందనల మేరకు తగు పరిష్కార మార్గాలు చూపడం జరుగుతుందని ఆర్డీవో అర్జీదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇఇలు పి.రమాదేవి, ఎండి యూసఫ్, వై శ్రీనివాస్, విశ్వనాధరెడ్డి, ఎడిఇ కృష్ణమరాజు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ఎస్ శ్యామల, ఎస్ దైవకుమార్ డవిజనల్ పంచాయితీ అధికారి హరినాధ్, జి.సి.సి డిఎం ఎం జగన్నాధరెడ్డి డిఇలు పద్మనాభం, పి.ఎస్.వి లక్ష్మి, దుర్గాప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ లక్ష్మారెడ్డి, తాహసిల్దారు కె లక్ష్మీ కళ్యాణి, పిహెచ్ ఓ వై సత్యనారాయణ, ఎపిడి సత్యంనాయుడు, ఎపిడీ రబ్బరు నాగరాజు, సబ్ యూనిట్ అధికారి రామకృష్ణ, హెచ్ఎంసీ వైద్యాధికారి జి రాజ్ కుమార్, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ న్యూస్ పోస్ట్ చేసిన వారు : PSVPrasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme