స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) జిల్లాలో అమలు చేసిన తీరు ఆదర్శనీయం

Advertiseme

– 2020 సంవత్సరానికి స్వచ్ఛభారత్ జాతీయ అవార్డులను వర్చువల్ విధానంలో
విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ సిటీ :

స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాలను తూర్పుగోదావరి జిల్లాలో అమలు చేసిన తీరు ఆదర్శనీయమని కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభినందించారు. గురువారం వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యక్రమం క్రింద ఓడిఎఫ్ (బహిరంగ మలవిసర్జన రహిత) కార్యాచరణలను పటిష్టంగా అమలు చేసిన జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 2020 సంవత్సరానికి స్వచ్ఛభారత్ జాతీయ అవార్డులను వర్చువల్ విధానంలో అందజేశారు. దేశ వ్యాప్తంగా 20 జిల్లాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఎంపికైయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కేబినెట్ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిధిగా హాజరు కాగా, ఆ శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కఠారియా స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసిన స్పూర్తిదాయకంగా నిలిచిన పంచాయితీల సర్పంచ్ లతో మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖీ నిర్వహించి, లక్ష్యా సాధనకు వారు అనుసరించిన వ్యూహాలను, స్వచ్చ భారత్ కార్యక్రమాల ద్వారా ఆయా గ్రామాల్లో వచ్చిన గుణాత్మక మార్పులను అడిగి తెలుసుకుని, వారివారి విజయాలకు అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగింస్తూ స్వచ్ఛ భారతావని సాధనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు దేశ ప్రజలు చైతన్యంతో స్పందించి బహిరంగ మలవిసర్జన దుస్సాంప్రదాయనికి చరమగీతం పాడారని, గత 5 ఏళ్ల కాలంలోనే దాదాపు 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి ఒడిఎఫ్ భారత్ లక్ష్యాన్ని అందుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.  ఇంతటితో మన లక్ష్యం పూర్తి కాలేదని, నిర్మించిన మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ నిత్య,నిరంతర అలవాటుగా మలచుకొని, అన్ని ఆవాసాల్లో తడి, పొడి వ్యర్థాలను శాస్త్రీయమైన విధానాల్లో నియంత్రించడం ద్వారా సర్వత్రా ఆరోగ్య వాతావరణాన్ని నెలకొల్పడమే మనందరి ఏకైక గమ్యంగా కృషి చేద్దామని మంత్రి పిలుపు నిచ్చారు. అనంతరం స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) -2020 జాతీయ అవార్డులు సాధించిన 20 జిల్లాల కలెక్టర్లతో మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వర్చువల్ విధానంలో నేరుగా ముచ్చటించి, అవార్డు పత్రాలను, మెమెంటోలను అందజేసారు.  తూర్పు గోదావరి జిల్లా అవార్డును ఆయన జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డికి అందజేస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను జిల్లాలో స్పూర్తిదాయకంగా నిర్వహించిన తీరును కొనియాడారు. అలాగే కలెక్టర్ మురళీధరరెడ్డి స్వచ్ఛ భారత్ మిషన్ డైరక్టర్ గా గతంలో పనిచేసిన సందర్భంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్థాయిలో నడిపించారని మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.  జిల్లా కలెక్టర్ మురళీధరెడ్డి అవార్డును స్వీకరిస్తూ, జిల్లా ప్రజల స్వచ్ఛతా కాంక్షను, చైతన్యాన్ని గుర్తించి తూర్పు గోదావరి జిల్లాను జాతీయ అవార్డుకు ఎంపిక చేసిందనందుకు ప్రజలందరి తరపున మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవార్డు అందించిన స్పూర్తి, ప్రోత్సాహలతో స్వచ్ఛ భారత్ ఓడిఎఫ్, ఓడిఎఫ్-ప్లస్ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా జిల్లాలో చేపడతామని తెలియజేసారు. ఈ వర్చువల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ తో బాటు జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) చేకూరి కీర్తి, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా సమన్వయకర్త సిహెచ్ అప్పారావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ టి గాయత్రిదేవి, డిఈ కె రవీంద్రబాబు, ఎఈఈ సిహెచ్ స్వర్ణ లలిత, ఎన్ఐసి ఇంజనీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme