అంగన్వాడీలపై సచివాలయ మహిళా పోలీసుల వేధింపులు ఆపాలి

Advertiseme

– 26 న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
– అంగన్వాడీ , ఆశాలకు , కార్మికులకు సిఐటియు పిలుపు

విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక :

మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో చేసిన కార్మిక వ్యతిరేక మార్పులకు, కీలక రంగాలతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా, విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ , అంగన్వాడీలపై గ్రామసచివాలయ మహిళా పోలీసుల వేధింపులు ఆపాలంటూ సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం నెల్లిపాకలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం గజ్జెల.సుశీల అధ్యక్షతన జరిగిన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ( సిఐటియు ) విస్తృతస్థాయి సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పూనెం.సత్యనారాయణ , సిఐటియు మండల కార్యదర్శి డేగల.మాధవరావు , ప్రజానాట్యమండలి నాయకులు ఐవి, అంగన్వాడీ నాయకురాలు మాధవి ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఐటియూ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ పట్ల గ్రామ సచివాలయ మహిళా పోలీసుల వేధింపులు ఆపాలని ,అంగన్వాడీ సెంటర్ లకు గ్రామ సచివాలయాలతో సంబంధం లేకుండా స్టాకు ను అంగన్వాడీ కేంద్రాలకు నేరుగా అందించాలని , ఎటపాక కేంద్రంగా పూర్తి స్థాయి అధికారిని నియమించి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన కార్మిక చట్టాలను సవరిస్తూ  స్కీము వర్కర్లను తొలగించే కుట్ర చేస్తుందని, దానికి వ్యతిరేకంగా పోరాడి మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలను స్కీం వర్కర్లను గ్రామ సచివాలయాలకు అప్పగించి వారితో వెట్టి చాకిరి చేయించే కుట్ర చేస్తుందన్నారు. ఇప్పటికే సచివాలయ అధికారుల వేధింపులు ఎక్కువ అయ్యాయని, గతంలో అంగన్వాడీ సరుకులు నేరుగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చేవని, నేడు వాటిని నిలుపుదల చేసి సచివాలయాలకు అప్పగించి అంగన్వాడీలను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. వేధింపులు ఆపకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 26 న జరిగే సార్వత్రిక సమ్మెలో ఆశాలు, అంగన్వాడీలు, గ్రామ దీపికలు, మిడ్ డే మీల్స్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు బండారు.సూర్యకుమారి , రాణి, ప్రభావతి, రాజ్యలక్ష్మి, వీరమ్మ, కళావతి, ప్రేమకుమారి తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme