సచివాలయాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి….. ముమ్మిడివరం ఎమ్మెల్యే

Advertiseme

– నియోజకవర్గ సమీక్ష సమావేశంలో జెసి డా. లక్ష్మిశ
విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం :

సచివాలయ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ నిర్మాణాలను అధికార యంత్రాంగం సమన్యయంతో పని చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ సూచించారు. గురువారం ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం సమావేశపు హాలు నందు జాయింట్ కలెక్టర్ డా లక్ష్మీషా అధ్యక్షతన నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పాల్గొని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంట్రర్లు, అంగన్ వాడి కేంద్రాల నిర్మాణ పనులను వెంటనే చేపట్టి మార్చి 30 నాటికి పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా అధికారులకు దిశనిర్దేశం చేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గడువు కాలం 18 వారాల పాటు  ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నిర్మాణాల ను త్వరితగతిన పూర్తి చేయడంలో సహకరించేందుకు వారాంతపు బిల్లులు సత్వరం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలియ చేసారు. అన్ని శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పూర్తి సమన్వయం తో కలిసి పని చేయాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో  అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ కాకినాడ ఆర్డీఓ చిన్ని కృష్ణ లతో పాటు నాలుగు మండలాల ఇంజనీరింగ్ సిబ్బంది ఎంపిడీఓలు, తహసీల్దార్ లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme