దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి..

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట :

కార్మికులకు సిఐటియు పిలుపు మెరకు సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన నవంబర్ 26 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రంగంపేట మండలం లోని కార్మికులందరికీ సదస్సు నిర్వహించి సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది సిఐటియు మండల ఉపాధ్యక్షులు ఎం అమ్మాజీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అంగన్వాడి మరియు ఆశ మరియు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మరియు బిల్డింగ్ మరియు పంచాయతీ రంగాల నుండి కార్మికులు పాల్గొన్నారు సిఐటియు మండల కార్యదర్శి అన్ని రంగాల కార్మికులతో పాటు ప్రజలను కూడా కలుపుకొని చేయాలని అన్నారు మరియు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఇ.చంద్రావతి మాట్లాడుతు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు చట్టాల మార్పులు చేస్తున్నారని వాటిని విరమించుకోవాలని అన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నీ యధావిధిగా కొనసాగించి జిల్లాలో ఉన్న ఐదు కోట్ల పెండింగ్  క్లైమ్ లు ఇవ్వాలని అన్నారు పంచాయతీ కార్మికులకు 13 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తక్షణం విడుదల చేయాలని అన్నారు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కరోనా మొదలుకొని నేటి వరకు జీతాలు ఇవ్వలేదు ఇవ్వాలని అన్నారు స్కిమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనాలు ఇవ్వాలని  పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి  పెరుగుతున్న ధరలు అరికట్టాలని అన్నారు నవంబర్ 26 సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దర్గా సాహెబ్, బాబురావు, బ్రహ్మం, శ్రీను ,బి వరలక్ష్మి, గంగరాజు ,అబ్రహం, మహాలక్ష్మి ,పద్మ ,నీరజ ,ఎం రాజు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme